calender_icon.png 10 February, 2026 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయిలో సీఎం కప్ సాధించాలి

10-02-2026 12:00:00 AM

కలెక్టర్ హరిచందన దాసరి

సికింద్రాబాద్, ఫిబ్రవరి9 (విజయక్రాంతి): సీఎం కప్ 2025 సెకండ్ ఎడిషన్ ను తప్పక సాధించాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.సీఎం కప్2025 రెండో ఎడిషన్ జిల్లా స్థాయి క్రీడా పోటీలను జింఖానా గ్రౌండ్స్లో జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ రోహిణి, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సుధాకర్‌లతో కలసి జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత రెండుసార్లు కూడా సీఎం కప్ పోటీల్లో హైదరాబాద్ జిల్లా అత్యుత్తమ ప్రతిభ చూపి విజ యం సాధించిందని గుర్తు చేశారు.

ఈ సారి కూడా అదే స్థాయిలో ప్రతిభను కనబరిచి, శ్రమతో పాటు నిబద్ధతతో పోటీల్లో పాల్గొనాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈనెల 9 నుండి 12 వరకు జింఖానా గ్రౌండ్ తో పాటు వివిధ క్రీడా మైదానాల్లో క్రీడలను నిర్వహించడం జరుగుతుందని పది వేల మంది విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు.

హైదరాబాద్ జిల్లాకు గత క్రీడల్లో దాదాపు 183 కి పైగా మెడల్స్ సాధించడం సాధించడం జరిగిందని ఈ పోటీలలో 43 క్రీడలు 16 మండలాల విద్యార్థులు పాల్గొనున్నట్లు కలెక్టర్ హరిచందన తెలియజేశారు. కార్యక్రమంలో తహసిల్దార్ పాండు నాయక్, డిప్యూ టీ డిఇఓ పరమేశ్వరమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీదేవి, వివిధ పాఠశాల ప్రధానో పాధ్యాయులు, పిఈటిలు, వివిధ క్రీడా సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.