2 March, 2026 | 1:55 AM

సమష్టి కృషితో కష్టపడి పని చేయాలి

02-03-2026 12:11 AM

మున్సిపల్ చైర్మన్ సిహెచ్.కుమార్ గౌడ్

గుమ్మడిదల, మార్చి 1 : నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి జెసిబి, ట్రాక్టర్ డ్రైవర్స్ అసోసియేషన్ యజమానులు వాహనాలకు ఇన్సూరెన్స్ డ్రైవర్లకు లైసెన్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్ అన్నారు.

ఆదివారం గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో నూతన ట్రాక్టర్స్ జెసిబి వాహనదారులు అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని మున్సిపల్ చైర్మన్ సిహెచ్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్యా గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్స్ మూడు చింతల నరేందర్ రెడ్డి, కత్తుల రమేష్, సురభి కుమార్ గౌడ్, శ్రీచూర్ణం చక్రపాణి,బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి, నాయకులు పొన్నాల శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ రెడ్డి, మేకల యాదగిరి, తదితరులను శాలువాలతో సన్మానం చేశారు.

ఈ సందర్భంగా సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గుమ్మడిదల గ్రామానికి చెందిన ట్రాక్టర్ జెసిబి టిప్పర్ వాహనదారులు కలిసికట్టుగా ఉండి సర్వే నంబర్ 109 లో జరుగుతున్న నిర్మాణాలలో గ్రామానికి చెందిన వాహనాలకు పని కల్పించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన యూనియన్ కలిసికట్టుగా ఉండాలని సూచించారు.

తమ ప్రాంతంలో అభివృద్ధి పనులకు తమ వాహనాలకు పని కల్పించే విధంగా పాలకవర్గం చూస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ముద్దంగుల వడ్డే ఎల్లయ్య, యూనియన్ అధ్యక్షులు సంగం కుమార్, ఉపాధ్యక్షులు కాశబోయిన ఆంజనేయులు, కార్యదర్శి ముద్దంగుల భాస్కర్, మధ్యేటి మల్లేష్ క్యాషియర్ ఓనర్ సైన్ డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు.