కేటీఆర్ బూమరాంగ్..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీకే బూమరాంగ్ అవుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా.. రూ.5,900కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ , ఉపకార వేతనాల బకాయిలు చెల్లించడంలో విఫలమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 8 నెలల పాలనలోనే ఈ మొత్తం బకాయిలు పేరుకుపోయాయా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విద్యా సంవత్సరం కూడా పూర్తి కాలేదు. గత ప్రభుత్వం బకాయిలను చెల్లించకుండా కాంగ్రెస్‌పై నిందలు మోపడంపై విడ్డూరంగా ఉందనే వాదనలు వినిపి స్తున్నాయి. పదేండ్ల బీఆర్‌ఎస్ హయాంలో పేరుకుపోయిన బకాయిలకు.. ఏడాది పాలన కూడా పూర్తిగానీ కాంగ్రెస్‌ను బాధ్యడిని చేయడం.. బట్టకాల్చి మీద వేయడమేనని కాంగ్రెస్ నాయకులు కస్సుబుస్సుమంటున్నారు.






