కేసీఆర్ 3.o కావాలి
అనుభవజ్ఞుడు పాలకుడు కావాలనేది ప్రజల ఆకాంక్ష
* మునుపటిలా ప్రజల మధ్యకు వచ్చే ఉద్యమనేత, ప్రజానాయకుడిగా కేసీఆర్‌ను చూడాలని జనం ఆశపడుతున్నారు. తన అపార అనుభవాన్ని ఇప్పుడు రాష్ట్రంతో పాటు దేశం కోసమూ ఉపయోగించాలని కోరుకుంటున్నారు. రెట్టించిన ఉత్సాహంతో తిరిగి వచ్చి ఒక వెలుగు వెలగాలని ఆకాంక్షిస్తున్నారు.
* 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పుతో బీఆర్‌ఎస్ కేవలం 39 స్థానాలకు పరిమితమైం ది. ఈ ఫలితాన్ని ఓటమిగా కాకుండా ఆత్మపరిశీలనకు ఒక అవకాశంగా భావించాలి. 2028 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ 3.0 వెర్షన్ కోసం ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. రాష్ట్రానికి కేసీఆర్ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడే సీఎం కావాలని మెజారిటీ ప్రజలు కోరు కుంటున్నారు.
కీలక సూచనలు
* బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ క్యాడర్‌కు అందుబాటులో ఉండాలి.
* గ్రామస్థాయి నేతలకు నాయకులు పిలిస్తే పలికేవిధంగా దగ్గరగా ఉండాలి.
* ఉద్యమ కాలంనాటి పాత మిత్రులను దూరంచేసే కోటరీని దూరంపెట్టాలి.
* పోరాట సమయంలో వెన్నంటి నిలిచిన అంకితభావం గల నేతలకు ఇప్పటికైనా సముచిత స్థానం కల్పించాలి.
* తన ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ వైద్యుల సూచనల ప్రకారం పనిచేయాలి.
* పార్టీ తొలినాళ్ల నుంచి అండగా ఉన్న స్థానిక కాంట్రాక్టర్లను, వ్యాపారులను గౌరవించాలి. అప్పటి ఉద్యోగులకు ప్రాధాన్యమివ్వాలి
* చిన్న తరహా పరిశ్రమలు, ఉద్యోగుల సమస్యలను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యమివ్వాలి.
* బీసీ, ఎస్సీ, ఎస్టీలతోపాటు మహిళలకు పదవుల్లో అధిక వాటా ఇవ్వాలి. తద్వారా సామాజిక న్యాయం చేయాలి.
* ఉద్యమ సమయంలో అమరులైన కుటుంబాల సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలి.
* వెనుకబడినవర్గాలకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి.
* తెలంగాణ ఆత్మగౌరవం ఉట్టిపడేలా కొత్త అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలి.
* సాగునీటి వనరులు, ఉపాధి, ఉద్యోగాల కల్పనపై మరింత దృష్టి సారించాలి.
* వ్యాపార నిర్వహణ సులభమైన పద్ధతిలో ఉండేటట్టు చూడాలి. ఆ విధానాన్ని నిజాయితీగా అమలు చేయాలి.
బీఆర్‌ఎస్ (అప్పటి టీఆర్‌ఎస్) 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగా ణ సమాజం తమ ప్రియతమ నాయకుడు కేసీఆర్‌కు ఘనంగా వందనం తెలుపుతున్నది. 2001 ఏప్రిల్ 27న ఒకే లక్ష్యంతో మొదలైన ఈ రాజకీయ ప్రయాణం తెలంగాణ సాధన కోసం అలు పెరగని పోరాటం చేసింది. పట్టుదలతో సాగిన ఈ ఉద్యమం 2014 జూన్ 2న ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసింది. నవ రాష్ట్ర నిర్మాణంలో కేసీఆర్ పోరాట పటిమ అపూర్వమైనది.
కేసీఆర్ నాయకత్వం ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. 2014 తొలి అసెంబ్లీ ఎన్నికల్లో 63 స్థానా లు సాధించి రాష్ట్రంలో తొట్టతొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2018లో ప్రజలు 88 స్థానాలతో కేసీఆర్‌కు మరోసారి ఘన విజయాన్ని అం దించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఆర్థిక రం గాలు వేగంగా వృద్ధిచెందాయి. ఎనిమిదేళ్లలోనే రాష్ట్ర జీఎస్డీపీ రూ.5.05 లక్షల కోట్ల నుంచి రూ. 12.93 లక్షల కోట్లకు చేరింది. సగటు వార్షిక వృద్ధి రేటు 17.24 శాతానికి పెరిగింది.
తలసరి ఆదా యం రూ.3.47 లక్షలకు చేరుకుని దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తలసరి ఆదాయం జాతీయ సగటును మించి ఉం డటం విశేషం. వ్యవసాయ రంగంలో తెలంగాణ విప్లవాత్మక మార్పులను సాధించింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి ఏకంగా 350% వృద్ధి చెందింది. రాష్ట్రం దేశంలోనే రెండో అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా ఎదిగింది. 2014లో ఉన్న 1.31 కోట్ల ఎకరా ల సాగు భూమి 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. సాగునీటి సౌకర్యం 84% విస్తరించడం కీలక మైలురాయిగా నిలిచింది.
రైతులకు చేయూత..
ముఖ్యమంత్రిగా కేసీఆర్ రైతుబంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాను విజయవంతం చేశారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ శుద్ధజలం చేరింది. ఐటీ ఎగుమతులు 350 శాతం వృద్ధితో రూ. 2.57 లక్షల కోట్లకు చేరాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గ్రీనరీ 7.7 శాతం పెరిగింది. ఆ ప్రభుత్వం 1.33 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది. దేశ జనాభాలో తక్కువ వాటా ఉన్నప్పటికీ ఉద్యోగ కల్పనలో రాష్ట్రం 5 శాతం వాటా అందిస్తున్నది.
కేసీఆర్ పదేళ్ల పాలన గణాంకాలకే పరిమితం కాకుండా ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సాగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు కల్యాణలక్ష్మి, ఆసరా వంటి పథకాలు లక్షలాది మందికి అండగా నిలిచాయి. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి ఐటీ, ఫార్మా కేంద్రంగా తీర్చిదిద్దారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పుతో బీఆర్‌ఎస్ కేవలం 39 స్థానాలకు పరిమితమైంది. ఈ ఫలితాన్ని ఓటమిగా కాకుండా ఆత్మపరిశీలనకు ఒక అవకాశంగా భావించాలి.
2028 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు కేసీఆర్ 3.0 వెర్షన్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. రాష్ట్రానికి కేసీఆర్ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడే ఉత్తమమని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. నాయకత్వం ఇప్పుడు పార్టీ కార్యకర్తలకు, గ్రామీణ స్థాయి నేతలకు మరింత అందుబాటులో ఉండాలి.
ఉద్యమ కాలం నుంచి నమ్మకంగా ఉన్న పాత నాయకులకు సముచిత ప్రాధాన్యమివ్వాలి. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన యూటీ బ్యాచ్‌ని గుర్తించాలి. కేసీఆర్ తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వైద్యుల సూచనల మేరకు పనిచేయాలని కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.
చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలి..
పార్టీ తొలి రోజుల్లో అండగా నిలిచిన తెలంగాణ కాంట్రాక్టర్లు, స్థానిక వ్యాపారులు, చిన్న పరిశ్రమలను మళ్లీ ప్రోత్స హించాలి. ఉద్యమ సమయంలో ప్రాణాలను, కుటుంబాలను కోల్పోయిన వారి సమస్యలను మానవత్వంతో పరిష్కరించాలి. సామాజిక న్యాయం దిశగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలతో పాటు మహిళలకు పదవుల్లో అధిక వాటా కల్పించాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటేలా సరికొత్త ప్రణాళికను సిద్ధం చేయాలి. సాగునీటి వనరుల పెంపు, ఉద్యోగాల సృష్టి, వ్యాపార నిర్వహణ సరళత (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)పై ప్రత్యేక దృష్టి సారించాలి.
చిన్న చిన్న రాజకీయాల కంటే రాష్ట్ర పురోగతే లక్ష్యంగా యువతలో నమ్మకాన్ని నింపాలి. పార్టీ కోసం శ్రమిస్తున్న నాయకులకు సముచిత గౌరవం కల్పించాలి. మునుపటిలా ప్రజల మధ్యకు వచ్చే ఉద్యమనేత, ప్రజానాయకుడు కేసీఆర్‌ను చూడాలని జనం ఆశపడుతున్నారు. తన అపార అనుభవాన్ని ఇప్పుడు రాష్ట్రంతో పాటు దేశం కోసం కూడా ఉపయోగించాలని కోరుకుంటున్నారు. రెట్టించిన ఉత్సాహంతో కేసీఆర్ తిరిగి ఒక వెలుగు వెలగాలని ఆకాంక్షిస్తున్నారు. జై తెలంగాణ!!
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి






