12 March, 2026 | 10:18 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

విజ్ఞాన శాస్త్రంపై జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

25-11-2025 12:00 AM
  1. విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలల ద్వారా విద్యార్థులకు  ప్రయోగాత్మక విద్య అందుతుంది

రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

నిర్మల్ నవంబర్ 24 (విజయక్రాంతి) : విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలల ల ద్వారా విద్యార్థులకు  ప్రయోగాత్మక విద్య అందుతుందని రాష్ట్ర ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడు గ్రామంలోని బాలికల ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాలలో 13.50 లక్షల వ్యయంతో నెలకొల్పిన విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ను మంత్రి జూపల్లి, అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జ పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ లతో కలిసి ప్రారంభించారు.

విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించిన మంత్రి, ల్యాబ్ లోని పరికరాలను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలు పెంపుదల కొరకు ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలల ద్వారా విద్యార్థుల పరిజ్ఞానం పెంపొందడమే కాకుండా, వారిలో విజ్ఞాన శాస్త్రంపై జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్న కుతూహలం పెరుగుతుందని అన్నా రు.

ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ ల్యాబ్‌ను చక్కగా ఉపయోగి, వారి పరిజ్ఞానం పెరిగేలా బోధనలు జరపాలన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ, ల్యాబ్ లో పొందుప రిచిన పరికరాల వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో మెరుగైన విద్యను విద్యార్థులకు అందించేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతుం దన్నారు.

విద్యార్థులతో కలిసి భోజనం చేశారు పాఠశాల అవసరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జుమంద్ అలీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీమ్ రెడ్డి, డీఈవో భోజన్న, జెడ్పీ సీఈవో గోవిం ద్, స్థానిక నాయకులు గంగారెడ్డి ప్రిన్సిపల్ ప్రశాంతి ఎంపీడీవో సురేష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.