24-11-2025 10:46:42 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): విద్యార్థులు శాస్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం పద్మాజివాడి స్ప్రింగ్ ఫీల్డ్ హైస్కూల్లో జాతీయ వైద్య విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ హాజరై మాట్లాడారు. నేటి బాలలే రేపటి భవిష్యత్తు పౌరులు కనుక ప్రతి విద్యార్థి నూతన శాస్త్రీయ దృక్పథాన్ని ఆలోచనాలను పెంపొందించుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వారు తయారు చేసిన సైన్స్, 550 ప్రాజెక్టులు, 91 ప్రాజెక్టులు ఇన్స్పైర్లో పాల్గొనడం పిల్లల్లో ఉన్న శాస్త్రీయ దృక్పథానికి నిదర్శనం అని అన్నారు. ఈ విద్యార్థిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వివిధ పాఠశాలల నుంచి వచ్చిన సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సోమవారం స్ప్రింగ్ ఫీల్డ్స్ హై స్కూల్ లో జరుగుతున్న జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించి విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగ ఎగ్జిబిట్లను అభినందిస్తూ కామారెడ్డి జిల్లాలలో అట్టహాసంగా 550 ప్రాజెక్టులు, ఇన్స్పైర్లో 91 ప్రాజెక్టులు పాల్గొనడం పిల్లల్లో ఉన్న శాస్త్రీయ దృక్పథానికి నిదర్శనమని తెలుపుతూ, ప్రతి విద్యార్థి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసే ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని శాస్త్రీయ దృక్పథాన్ని శాస్త్రీయ ఆలోచనను పెంపొందించుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరామిరెడ్డి వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.