15 April, 2026 | 12:00 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

విద్యార్థులకు విద్యతో పాటు విజ్ఞానం, క్రీడలు, యోగ అందిస్తున్నాం

28-02-2026 09:38 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): విద్యార్థులకు విద్యతో పాటు విజ్ఞానం, క్రీడలు, యోగ లాంటి మరెన్నో కార్యక్రమాలను అందిస్తున్నామని విజయరత్న సిబియన్ఇ పాఠశాల డైరెక్టర్లు పేర్కొన్నారు. ఘట్ కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధి చౌదరిగూడలోని విజయరత్న సిబియన్ఇ పాఠశాలలో రాజన్ ఎఫెక్ట్ డే అనగా జాతీయ సైన్సే డే సందర్భంగా పాఠశాలలో డైరెక్టర్లు విజయసేనారెడ్డి, నరేంద్రనాథ్, నరసింహారావు, శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి విజ్ఞాన ప్రదర్శనను శనివారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన వ్యవసాయ, శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన వివిధ రకాల ప్రాజెక్టులు ఆహుతులను ఎంతగానో ఆకర్షించాయి. ముఖ్యంగా స్పేస్, మ్యాజిక్ కెమికల్, రియాక్షన్స్, ఫీజో ఎలక్ట్రిక్ రోడ్, రోబోటిక్స్, కంప్యూటర్, రామన్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నటిజంలకు సంబంధించిన నేత రకాల ప్రదర్శనలు ఆకర్షణీయంగా నిలిచాయి.

ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్లు సాంకేతిక రంగాలతో పాటు వివిధ కళలకు కూడా అధిక ప్రాధ్యాన్యతనిస్తూ విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న విజ్ఞాన తృష్ణను వెలికితీస్తూ సృజనాత్మకతను పెంచే విధంగా ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలియజేశారు. విద్యార్థులు చూపిన ప్రతిభను కీర్తిస్తూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకొని మరిన్ని విజయాలు సాధించి విలువైన రత్నాలుగా మారి దేశాభివృద్ధికై పాటు పడ్డాలని అభిలషిస్తూ విజయరత్న పాఠశాల కోరుకుంటుందని వారు పేర్కొన్నారు.