11 April, 2026 | 6:26 PM

స్వచ్ఛ బోడుప్పల్ కు సహకరించాలి: బోడుప్పల్ కమిషనర్ శైలజ

13-10-2025 07:26 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): బోడుప్పల్  నగర పాలక సంస్థలో పలు చెత్త వేసే ప్రాంతములను గుర్తించి తక్షణమే చెత్త ను శుభ్రం చేయాలని,ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్  కమీషనర్ శైలజ పారిశుధ్య అధికారులను, సిబ్బందిని ఆదేశించడం జరిగినది. ఇట్టి ఆదేశములతో సోమవారం 7వ డివిజన్ శివాలయం రోడ్డులో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగముగా చెత్త ను తొలగించారు. ఈ సందర్బంగా కమీషనర్ మాట్లాడుతూ ఎవరైనా బహిరంగ ప్రదేశములలో చెత్త వేస్తే భారీ జరిమానాతో పాటు క్రిమినల్ చర్యలు మున్సిపల్ చట్టము ను అనుసరించి విధించబడునని హెచ్చరించారు. ప్రజలందరూ చెత్త ను స్వచ్ఛ వాహనములకు అందచేసి స్వచ్ఛ బోడుప్పల్ కు సహకరించాలని కోరారు.