27 July, 2026 | 6:06 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

ఏసీబీ వలలో సంక్షేమ శాఖ ఉద్యోగిని

11-06-2026 01:40 AM

కరీంనగర్ క్రైం, జూన్10(విజయక్రాంతి): కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్ కోసం డిజిటల్ పేమెంట్ల రూపంలో రెండు లక్షలకు పైన లంచాలు వసూలు చేస్తున్న జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రాధికను అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. ఐసీడీఎస్ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు, పప్పులు సరఫరా చేసే కాంట్రాక్టర్ల నుంచి ఆమె ఈ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.

కాంట్రాక్టర్లకు సంబంధించిన బిల్లులను త్వరగా క్లియర్ చేయడం, పెండింగ్‌లో ఉన్న ఫైళ్లను ముందు కు కదిలించడం కోసం రాధిక పెద్ద ఎత్తున డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ అవినీతి వ్యవహారంలో రాధిక ఒక్కరే ఉన్నారా లేక ఇంకెవరైనా ఉన్నారా? అని ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.