calender_icon.png 13 October, 2025 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభినందనలు తెలిపిన దారం శ్రీనివాస్ రెడ్డి

13-10-2025 07:26:54 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): ప్రపంచ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెన్నై తమిళనాడులో జరిగిన బోధి వరల్డ్ రికార్డ్ అధికారిక ప్రయత్నంలో పాల్గొని అప్రిసియేషన్ సర్టిఫికేట్ అందుకున్న అన్వర్ ఖాన్, ఆయన కుమారులు ఫర్హాన్ ఖాన్, అర్మాన్ ఖాన్‌లను టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. అన్వర్ ఖాన్ తన కుటుంబ సభ్యులను కరాటేలో ప్రావీణ్యం సాధించేలా తీర్చిదిద్దడమే కాకుండా, పేద విద్యార్థులకు స్వీయ రక్షణతో పాటు ఆత్మస్థైర్యం పెంపొందించే శిక్షణ అందిస్తూ కరీంనగర్‌కు గౌరవం తెచ్చారని ఆయన పేర్కొన్నారు. 

కరాటే క్రీడలు పిల్లల్లో మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందించి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తినిస్తాయని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఓటమి వచ్చినప్పుడు ఎలా గెలవాలో, పడిపోయినప్పుడు ఎలా లేవాలో నేర్పే క్రీడ కరాటే అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సర్దార్ హరేమేందర్ సింగ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కోట రామస్వామి, కార్యదర్శి శంకర్ రాజు, కోటేష్, మల్లేశం తదితర ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.