26 February, 2026 | 4:40 PM

సమగ్ర భూ సర్వేకు సహకరించాలి

26-02-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 25(విజయక్రాంతి): భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే అవగాహన సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ మండలం ధనాపూర్ గ్రామంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె హాజరయ్యారు.

తెలంగాణ సర్వే, సరిహద్దుల చట్టం1923 ప్రకారం ధ్యానాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి జీపీఆర్‌ఎస్ సాంకేతికతతో వ్యవసాయ భూముల సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్వే పూర్తయితే భూ వివాదాలు తగ్గి రైతులకు స్పష్టమైన హక్కులు లభిస్తాయని పేర్కొన్నారు.అలాగే ప్రధానమంత్రి ముద్ర రుణాలు, ఎస్సీఎస్టీ అభివృద్ధి రుణాలు, స్వయం ఉపాధి పథకాలు, విశ్వకర్మ, జన సురక్ష పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.