calender_icon.png 19 January, 2026 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలను తీర్చే వారినే ఎన్నుకోవాలి

19-01-2026 01:35:32 AM

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం స్కామ్ లేని 11 సంవత్సరాల పరిపాలన

మల్కాజిగిరి బీజేపీ పార్లమెంట్ సభ్యులు: ఈటల రాజేందర్

మేడ్చల్ అర్బన్, జనవరి 18(విజయక్రాంతి): రానున్న మున్సిపల్ పురపాలక సంఘ ఎన్నికల్లో ప్రజల సమస్యలను తీర్చే నాయకుడినే ఎన్నుకోవాలని మల్కాజిగిరి బిజెపి పార్లమెంటు సభ్యులు మాజీ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ పేర్కొన్నారు.ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ బిజెపి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షులు ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.భారతీయ జనతా పార్టీ మున్సిపల్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి మల్కాజిగిరి బిజెపి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

రానున్న ఎల్లంపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేసే నాయకుడిని కౌన్సిలర్ అభ్యర్థిగా నిర్ణయించాలని పార్టీ నాయకులకు సూచించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు గడిచిన ఒక్క స్కామ్ లేకుండా ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నీతివంతమైన పాలన అందిస్తున్నారని ఈటల రాజేందర్ కొనియాడారు.

భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏమి నిధులు మంజూరు చేస్తున్నారు అన్న కాంగ్రెస్ పార్టీ ప్రశ్నలకు దేశంలో ఏర్పాటు చేస్తున్న జాతీయ రహదారులు,మేడ్చల్ లాంటి ఫ్లైఓవర్ బ్రిడ్జిలతో పాటు అయోధ్య చౌరస్తాలో 128 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కండ్లకు కనిపించడం లేదా అంటూ ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నేతలను దూషించారు.మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో 7 శాసనసభ నియోజక వర్గాలు ఉంటాయని అందులో మూడు నియోజకవర్గాలు మెజారిటీని ఇవ్వకున్ను నాలుగు నియోజకవర్గాలు మెజార్టీ ఇస్తే పార్లమెంటు సభ్యులు గెలుస్తారని ఆయన చెప్పారు.

అంతే కాకుండా మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు ఓట్లు వేస్తేనే కౌన్సిలర్ గెలుస్తారని పార్లమెంట్ కు మున్సిపల్ కౌన్సిలర్ కు చాలా తేడా ఉంటుందని ఈటల రాజేందర్ కౌన్సిలర్ అభ్యర్థులకు తెలిపారు.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపాలిటీలకు నిధులు తెప్పించిన ఘనత బిజెపి ఎంపి తనకు ఉంటే ప్రారంభోత్సవాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎగిసిపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభోత్సవాల పేరిట మూడు మున్సిపాలిటీలలో హంగామా చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు.రానున్న ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల సమస్యలపై నిత్యం దృష్టి సారించి ఎమ్మార్వో,పోలీస్ స్టేషన్,సబ్ రిజిస్టర్,ఎలక్ట్రిసిటీ,మున్సిపల్ కార్యాలయాలలో ప్రజలకు నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే ప్రజలు నాయకులను ఎన్నుకుంటారన్న విషయాన్ని మర్చిపోవద్దని ఈటల రాజేందర్ గుర్తు చేశారు.రానున్న మున్సిపల్ ఎన్నికల సమయంలో తను ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటానని మీరు మాత్రం నిర్లక్ష్యం వహించకుండా ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించి విజయకేతనం ఎగరవేయాలని ఆయన పోటీ చేసే మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులకు సూచించారు.

అనంతరం మల్కాజిగిరి బిజెపి ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని వివిధ మున్సిపల్ పట్టణాల నుండి పెద్ద ఎత్తున బిజెపి పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ రూరల్ బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్.మాజీ అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి.జిల్లా ఇన్చార్జి సామ రంగారెడ్డి.మేడ్చల్ అసెంబ్లీ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి.సీనియర్ నాయకులు నారెడ్డి నందా రెడ్డి.జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శులు అమరం మోహన్ రెడ్డి.గోనె శ్రీనివాస్.జిల్లా బిజెపి కార్యదర్శి సింగిరెడ్డి నరేందర్ రెడ్డి.జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్.రామన్నగారి శ్రీనివాస్ గౌడ్.మేడ్చల్ మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్ బిజెపి సీనియర్ నాయకులు కొరివి పోచయ్య.సుధాకర్ రెడ్డి శ్రీనాథ్ రెడ్డి.మహేష్ శ్రీనివాస్.రాఘవరెడ్డి.రాగం అర్జున్ తదితరులు పాల్గొన్నారు.