19-01-2026 01:32:47 AM
షాద్నగర్, జనవరి 18, (విజయక్రాంతి): భక్తిశ్రద్ధలతో వాసవి క్లబ్ , వాసవి వనిత ఆధ్వర్యంలో ఆదివారం షాద్ నగర్ పట్టణం చౌడమ్మ గుట్ట హనుమాన్ దేవాలయం లోని శ్రీ కృష్ణ గోశాలలో అమావాస్య పురస్కరించుకుని వాసవి క్లబ్ షాద్నగర్ అధ్యక్షుడు గుంత సత్య నారాయణ ఆధ్వర్యంలో గోపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు రాఘవేంద్ర చార్యులు బృందం ఈ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ సందర్భంగా అమావాస్య, గోపూజ మహోత్సవ విశిష్టతను అర్చకులు వివరించారు.
అలాగే దేవాలయంలో ఉదయం గణపతి హోమం కొనసాగించారు. ఈ సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోశాలలోని గోవులకు ఆకుకూరలు , పండ్లు, పప్పు,బెల్లం పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంత సత్య నారాయణ, ప్రధాన కార్యదర్శి గజవాడ యశ్వంత్, కోశాధికారి శ్రీనివాస్, క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ దొంతు పాండురంగయ్య , డిస్టిక్ ఆఫీసర్స్ వాడకట్టు విజయకుమార్ జెడ్ సి కల్వ మాణిక్యం , వాసవి వనిత అధ్యక్షురాలు చంద్రిక, ప్రధాన కార్యదర్శి గజ్జల మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.