15 April, 2026 | 2:58 AM

అంబేద్కర్ చూపిన బాటలో నడవాలి

15-04-2026 12:23 AM
  1. ఎస్సీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించారు

బీసీలు, ముస్లింలు ఇంకా వెనుకబడి ఉండటం బాధాకరం

బహుజన వర్గాలు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడాలి

మాజీ డీజీపీ జే పూర్ణచంద్రరావు

మీడియా సెంటర్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి

ఖైరతాబాద్, ఏప్రిల్ 14(విజయక్రాంతి): అంబేద్కర్‌ను కేవలం స్తుతించడం కాకుండా ఆయన చూపిన మార్గంలో నడవడం అత్యవసరమని ఆల్ ఇండియా బహుజన్ సమా జ్ పార్టీ (ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్ జె. పూర్ణచంద్ర రావు పేర్కొన్నారు. అణగారిన వర్గాల సమస్యలను పరిష్కరించాలంటే, వాటిని అణిచివేసే రాజకీయ పార్టీల్లో చేరడం ద్వా రా సాధ్యం కాదని స్పష్టం చేశారు.

మంగళవారం లక్డీకాపూల్ డౌన్‌టౌన్ మాల్‌లోని మీడియా సెంటర్‌లో మంగళవారం మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత, భారతీయ న్యాయవేత్త, సంఘ సంస్కర్త జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీసీ సమాజ అధ్యక్షుడు సంగెం సూర్యారావు అధ్యక్షత వహించగా, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ప్రధాన రాజకీయ పార్టీలకు దూరంగా ఉండటానికి కారణం వారి నిర్మాణం సామాజిక న్యాయానికి అనుకూలంగా లేకపోవడమేనని ఆయన వివరిం చారు. అంబేద్కర్‌ను ఓడించిన శక్తులను మనమే గెలిపించడం వల్ల బహుజన వర్గా లు రాజకీయంగా నష్టపోయాయని అన్నా రు. 1921, 1931 కులగణన ఆధారంగా అం బేద్కర్  ఎస్సీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు సాధించి, వాటిని రాజ్యాంగంలో స్థిరపరిచారని గుర్తుచేశారు. అయితే, తరువాత కాలం లో బీసీల కులగణన నిలిపివేయడం వల్ల వారికి తగిన న్యాయం జరగలేదని విమర్శించారు.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా లభిం చకపోవడం, అలాగే బీసీలు, ముస్లిం లు ఇంకా చట్ట సభల్లో రాజకీయ వాటా వెనుకబడి ఉండటం బాధాకరమన్నారు. ఎస్టీలలో ఎరుకలు, యానాదులు, చెంచులు, నక్కల వారు, అలాగే రెల్లి ఎస్సీలు, బీసీలలో సంచా ర జాతులు, వడ్డెర, వడ్రంగి, కమ్మరి, కుమ్మ రి, కంసాలి, చాకలి, మంగలి, దూదేకుల వంటి అనేక వర్గాలు ఇంకా అసెంబ్లీలో ఒక్క రు కూడా ఎమ్మెల్యేలు కాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంబేద్కర్  సిద్ధాంతాల ప్రకారం రాజకీయ అధికారం లేకుండా సామాజిక న్యాయం సాధ్యం కాదని, బహుజన వర్గాలు ఐక్యంగా తమ హక్కుల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యాకూబ్, సూర్యనారాయణ (డీఆర్‌ఓ రిటైర్డ్), నారాయణ (ఏసీపీ రిటైర్డ్), చంద్రశేఖర్ (గ్రామీ ణ బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్), రామనర్సయ్య, అచ్యుత్, కవిత తదితర బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.