15 April, 2026 | 3:56 AM

ఆపదలో ఉన్న వారికి సాయం చేయాలి

15-04-2026 01:11 AM

మల్లిఖార్జున స్వామి కళ్యాణోత్సవంలో జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఏప్రిల్ 14 : ఆపదలో వున్నవారికి సాయం చేయాలన్నదే మల్లన్న, బీరప్ప దేవుళ్ల కథల్లోని సారాంశమని, దీనిని అందరం పాటించాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తెలిపారు. మంగళవారం సంగారెడ్డి పట్టణం గొల్లగూడెంలో కొలువైన శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల, జగ్గారెడ్డి కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏ కులమైనా, ఏ దేవుడైనా.. ఆపదలో వున్నవారికి సాయం చేయాలన్నదే ప్రధాన ఉద్దేశమన్నారు. మల్లన్న, బీరప్ప దేవుళ్ళ కథల్లోని సారాంశం కూడా ఇదేనని, దీనిని అందరం పాటిద్దామని చెప్పారు.

కులాలు అనే తేడా లేకుండా అందరూ కలిసి మెలిసి జీవించాలన్నదే మల్లన్న, బీరప్ప కథల్లో వున్న సందేశమని చెప్పారు. ఒగ్గు కళాకారులు చెప్పిన మల్లన్న, బీరప్ప ఒగ్గు కథలను జగ్గారెడ్డి ఆసక్తిగా విన్నారు. ఈ కల్యాణోత్సవంలో సంగారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ కూన వనితా సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.