రైతు మహోత్సవంలో ఉత్సాహంగా పాల్గొనాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, మార్చి 18 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు మహోత్సవం 2026 లో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రైతులను కోరారు. బుధవారం వ్యవసాయ , ఉద్యానవన, ఆయిల్ ఫెడ్, అనుబంధ శాఖల అధికారులు, ఆర్టీసీ డిపో అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమానికి సంబంధించి..
రైతులకు ఎటువంటి సమస్య రాకుండా, ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో అతిపెద్ద పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం, రైతు భరోసా నిధుల విడుదల వంటి కార్యక్రమాలతో పాటు వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు , యంత్ర పరికరాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లు, స్టాళ్లు ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారని...
నేరుగా శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రేపటినుండి మొదలుకొని 22.03.26 నాలుగు రోజులపాటు వివిధ కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. రైతులు ఇట్టి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశం లో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, మార్కెటింగ్, ఉద్యనవన తదితర శాఖలకు సంబందించిన అధికారులు పాల్గొన్నారు




