మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
- రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ
పేద ముస్లిం లకు రంజాన్ కానుకల అందజేత
వరంగల్, మార్చి 18 (విజయ క్రాంతి): మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో బుధవారం క్రిస్టల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈద్ కా తోఫా కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై పేద ముస్లిం లకు దుస్తులను బహుమతులుగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రంజాన్ పర్వదినం పరస్పర ప్రేమ, దయ, త్యాగానికి ప్రతీక అని సమాజంలో ఐక్యత, సోదరభావం మరింత బలపడేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని, పండుగల సందర్భంగా అవసరమైన సహాయాన్ని అందించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని,
ముఖ్యమంత్రి మైనారిటీల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను కొనియాడిన మంత్రి మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు 3500 ఈద్ కా తోఫాలను అందజేస్తున్నందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈద్ పర్వదినం అందరికీ శాంతి, సౌభాగ్యాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈద్ కా తోఫా ల అందజేత వల్ల నిరుపేద ముస్లిం లు పండగను సంతోషం గా ఆనందం గా జరుపుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.జిల్లా కలెక్టర్ డా. సత్య శారద మాట్లాడుతూ, రంజాన్ మనుషుల్లో మనస్పూర్తి, కరుణ, పరస్పర గౌరవాన్ని పెంపొందించే పవిత్రమైన పర్వదినమని తెలిపారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందాలంటే పరస్పర సహకారం అవసరమని, ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా అధికారులు కృషి చేస్తున్నారని చెప్పారు.
పండుగలు మనలను ఒకటిగా కలిపే వేదికలని, ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను మరింత బలపరుస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఫుర్ఖాన్, సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, చింతాకుల అనిల్ కుమార్, బస్వరాజు కుమార స్వామి, ఆర్ డి వో సుమ, డిఎండబ్ల్యూ ఓ రమేష్, బల్దియా డిప్యూటీ కమిషనర్ ప్రసన్న రాణి, తహసిల్దార్లు ఇక్బాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




