4 May, 2026 | 7:53 PM

పూలేను స్మరించుకోవాలి

28-11-2024 03:23 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 

హైదరాబాద్, నవంబర్ 27(విజయక్రాంతి): మహాత్మ జ్యోతిబా పూలేను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అన్నారు.  గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పూలే ఆలోచనలను ముందుకు తీసుకెళ్లి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారని గుర్తు చేశారు.

కేంద్రప్రభుత్వం రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడానికి చూస్తోందని విమర్శించారు. అంబేర్‌పేటలోని ఆలీకేఫ్ వద్ద గురువారం  నిర్వహించే పూలే వర్ధంతి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాసు మున్షీ,  పీసీసీ చీఫ్ మహేశ్, ఇతర నాయకులు హాజరవుతారని వీహెచ్ తెలిపారు.