2 July, 2026 | 11:53 AM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

చిన్ని గుండెలకు అండగా ఉంటాం

29-09-2024 02:31 AM

ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ సభ్యులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి) : దేశంలో ప్రతి యేటా 2 లక్షల మంది పిల్లలు పుట్టుకతోనే గుండె జబ్బులతో పుడుతున్నారని.. తక్షణ చికిత్సతో వారి ప్రాణాలు కాపాడగలమని ‘ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్’  సభ్యులు తెలిపారు.  శనివారం ఫౌండేషన్ సభ్యులు నగరంలో ప్రపంచ హృదయ దినోత్సవాన్ని నిర్వహించారు.

అధునాతన పీడియాట్రిక్ కార్డియాక్ చికిత్స అందుబాటులో లేకపోవడానికితోచిన్నారులు పుట్టిన కొన్నినెలలకే ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. సినీ నటుడు సాయిదుర్గతేజ్ ముఖ్యఅతిథిగా హాజరై ఫౌండేషన్ చేస్తున్న సేవలను అభినందించారు. తనవంతుగా ఫౌండేషన్‌కు రూ.5 లక్షలు విరాళంగా అందించారు. అలాగే లారస్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈవో డాక్టర్ సత్యనారాయణ రూ.25 లక్షలను విరాళంగా అందిచారు.