15-11-2025 12:00:00 AM
అనాథలైన చిన్నారులకు రూ. 2 లక్షలు ఆర్థికసాయం
చేవెళ్ల, నవంబర్ 14 ( విజయక్రాంతి) : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయి అన్నాథలుగా మారిన ఇద్దరు చిన్నారుల కు రాష్ట్ర నాయకుడు, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి అండగా నిలిచి తన ఉదారతను చాటాడు.వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్ గ్రామానికి చెందిన బందప్ప, లక్ష్మీ దంపతులు అమానుష ప్రమాదంలో మృతిచెందడంతో వారి కుమార్తెలైన భవానీ, శివలీల అనాథలయ్యారు.
ఈ ఘటన వివరాలు ”చేవెళ్ల న్యూస్ వాట్సాప్ గ్రూపులో చర్చకు రావడంతో చిన్నారుల పరిస్థితి అందరినీ కలిచివేసింది. పరిస్థితిని తెలుసుకున్న కార్తీక్ రెడ్డి పిల్లల భవిష్యత్తు, చదువు, సంరక్షణ కోసం రూ.2లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమం స్థానిక ప్రజల ప్రశంసలను పొందుతోంది. ఇలాంటి మానవీయ స్పందన సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. చిన్నారుల భవిష్యత్తుకై మరింత మంది ముందుకు రావాలని. పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపునిచ్చారు.