2 March, 2026 | 7:10 PM

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతుంది

02-03-2026 05:31 PM

దేవరకొండ,(పెద్దవూర),(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతుంది. నల్గొండ జిల్లా మాజీ జెడ్పి వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి  హాలియా మార్కెట్ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి కృష్ణారెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు జై వీర్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం పెద్దవూర మండల కేంద్రంలో మల్లికార్జున ఫంక్షన్ లో కళ్యాణ లక్ష్మి చెక్కులు,పంపిణీ, షాది ముబారక్,కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  అర్హులైన వారు ప్రభుత్వ పథకాలను  సద్వినియోగం చేసుకోవాలని కోరారు పెద్దవూర మండలం పరిధిలో65 మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యాదగిరి గౌడ్, నాగార్జునసాగర్ వార్డు కౌన్సిలర్ పగడాల నాగరాజు యాదవ్, పెద్దవూర సర్పంచ్ వెంకటయ్య గౌడ్, తుంగతుర్తి సర్పంచ్ మెండే ముత్యాలుయాదవ్, వెల్మగూడెం సర్పంచ్ కొమ్మగోని స్వాతి నాగరాజ్ గౌడ్, సంగారం సర్పంచ్ ఈసం రమేష్, ఉంగరాల శీను,తుమ్మలపల్లి రంగారెడ్డి, మండల యాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేపాకుల సాయి కుమార్ యాదవ్,మాజీ యూత్ అధ్యక్షుడు కిలారి మురళి యాదవ్,తదితరులు పాల్గొన్నారు.