పులిరాజ్ గౌడ్ ను పరామర్శించిన బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు
02-03-2026 06:23 PM
దేవరకొండ: చింతపల్లి మండలం గోడుకొండ్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాదేపల్లి పులిరాజ్ గౌడ్ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని లైఫ్ స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం లైఫ్ స్టార్ ఆసుపత్రిలో పులిరాజ్ గౌడ్ నీ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ గారు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మెరుగైన వైద్యం అందించాలని ఆయన సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన వెంట పలువురు బిఆర్ఎస్ నాయకులు,తదితరులు ఉన్నారు.




