04-08-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల: ఆగస్టు 3(విజయక్రాంతి) బీసీ డిమాండ్ల సాధనే లక్ష్యంగా బీసీ నినాదంతో దేశాన్ని అట్టుడికిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి ప ర్ష హన్మాండ్లు అన్నారు,జిల్లా అధ్యక్షుడు వీరబోయిన మల్లేష్ యాదవ్ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి పర్ష హన్మాండ్లు ముందుగా ఈనెల 7న గోవాలో జరిగే ఓబిసి పదవ మహాసభ విజయవంతం చేయాలని గోడ ప్రతులు,కరపత్రాలను బీసీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు.అనంతరం పర్ష హన్మాండ్లు మా ట్లాడుతూ... జనాభాలో మేమెంతో అన్ని రం గాల్లో మాకు అంత వాటా ఇవ్వాల్సిందేననీ అన్నారు, ఆగస్టు 7 1990 సంవత్సరం లో మాజీ ప్రధాని వి.పి సింగ్ మొదటిసారిగా మండల కమిషన్ సిఫార్సులు అమలు చేస్తున్నట్లు ప్రకటించారని ఆగస్టు 7 రోజున మం డలడే గా బీసీల అందరు భావిస్తున్నారని అందుకే ఆ రోజునే జాతీయ ఓబీసీ మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు,
బీసీలు పో రాడితే పోయేది ఏమీ లేదని బానిస సంకెళ్లు తప్ప అని అన్నారు, బీసీలనీ చెప్పుకునేందు కు గతంలో బీసీలు జంకినారనీ బీసీ అని సగర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయంటే అవి బీసీ ఉద్యమాల వలన అది మేము చేసి న ఉద్యమాలు అని అన్నారు, తెలంగాణ రా ష్ట్రంలో మరి జాతీయస్థాయిలో ఢిల్లీలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో మడమ తిప్పకుండా పోరాటం చేస్తేనే తెలంగాణలో బీసీ కులగనన,
అటు దేశంలో జాతీయ జనగణన ల లో కులగనన చేపట్టాలని నిర్ణయం తీసుకు న్న విషయం గుర్తు చేస్తున్నట్లు పర్ష హన్మాం డ్లు అన్నారు, ఈ దేశంలో ఉత్పత్తి బీసీల అయినప్పుడు సంపద కూడా బీసీలదే కావాలని రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశాన్ని బ తికిస్తుంటే పిడికెడు శాతం లేని వాళ్ళు సర్వసంపదను, శ్రమను దోచుకుంటున్నారన్నా రు, విద్యా ,ఉద్యోగ ,స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సంబంధించిన బిల్లులు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో మూలుగుతున్నాయని వాటిని సాధించుకొని తీరుదామని
ఈ సందర్భంగా పర్ష హన్మాండ్లు అన్నారు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయా లని, కేంద్ర బడ్జెట్లో బీసీలకు జనాభా దామా ష ప్రకారం నిధులు కేటాయించాలని, బీసీ రిజర్వేషన్లు పెంచాలని, చట్టసభలలో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించా లని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట ఇవ్వాలని ,బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని,
బీసీల క్రిమి లేయర్ ఎత్తివేయాలని ఈ సందర్భంగా. డిమాండ్ చేస్తూ బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించుదామని ప్రతి ఒక్క బీసీ భాగస్వాములు కావాలని. పిలిపించారు.ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేని మల్లేష్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్, జిల్లా అధికార ప్రతినిధి బండారి బాల్ రెడ్డి, బీసీ సేన జిల్లా అధ్యక్షుడు బట్టు ప్రవీణ్, నాయకులు బోయి న శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.