04-08-2025 12:00:00 AM
-కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలి
-సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్
మందమర్రి, ఆగస్టు 3: సింగరేణి యాజమాన్యం 2024 ఆర్థిక సంవత్సరంలో సాధించిన లాభాలను ప్రకటించి కార్మికుల కు 35 శాతం లాభాల వాటా చెల్లించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియ న్ (సీఐటీయూ) అధ్యక్ష, కార్యదర్శులు సాం బారు వెంకటస్వామి, అల్లి రాజేందర్ డి మాండ్ చేశారు.
పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కమిటీ సమావేశంలో వారు మాట్లాడారు. సంస్థ సాధించిన లాభాలను ప్రకటించకుం టే సింగరేణి వ్యాప్తంగా ఆందోళనలు ఉధృ తం చేస్తామన్నారు. గుర్తింపు సంఘం ఏఐటీ యూసీ నాయకులు నేటికీ లాభాలను సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన చేయించలేక వాటా కోరడం వారి చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు.
స్ట్రక్చరల్ సమావేశాల లో చర్చించిన వాటిపై సర్కులర్లు ఇప్పించి అమలు చేయించలేని నిస్సహయ స్థితిలో గుర్తింపు సంఘం ఉన్నదని, వేజ్ బోర్డ్ ఒ ప్పందాలకు కమిటీలు వేసి ఆలస్యం చేస్తున్న తీరే దీనికి నిదర్శనం అని విరుచుకుపడ్డారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ వద్ద చేసుకున్న ఒప్పందాలను అమలు చేయించలేకపోతున్నారని, మెడికల్ బోర్డు లో మైనింగ్ స్టాఫ్‌కు తగిన పని ఇప్పించలేక పోయారని విమర్శించారు.
నేటికీ బాట బూ ట్లు, రక్షణ పరికరాలు ఇప్పిస్తామని చెప్తూ కా లం గడుపుతున్నారే తప్ప వాటిని అమలు చేయించలేక పోతున్నారని మండిపడ్డారు. కెకె 5 గనిలో జరిగిన ప్రమాదంలో కార్మికు డు మృతి చెందడం బాధాకరమని సేఫ్టీ కమి టీ, మైన్స్ కమిటీలు అనుభవజ్ఞులచే నడిపించాలని, ప్రస్తుతం ఉన్న కమిటీలు సరిగ్గా పని చేయక పోవడం మూలంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశా రు.
ఎవరైనా కార్మికులు ప్రశ్నిస్తే వారిని మా నసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని, దీంతో డ్యూ టీలు చేయలేక నాగాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. ప్రీ షిఫ్ట్‌లు నడపడంతో కార్మికుల సంఖ్య తక్కువగా ఉండి కార్మికులపై పనిభారం పెరుగుతున్నా గుర్తింపు సంఘం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో రాష్ర్ట కమిటీ సభ్యుడు జోర్క వెంకటేశ్, మై నింగ్ స్టాప్ సభ్యుడు కుక్కల శ్రీనివాస్, దెబ్బ టీ తిరుపతి, నాగవెల్లి శ్రీధర్, పసునూటి శ్రీకాంత్, ఆగిడి రాజ్ కుమార్, కాంపెల్లి నాగరాజు, నామని సురేష్, సయ్యద్ అమీర్, లింగాల రమేశ్, చైతన్య, ఆదర్శ్ పాల్గొన్నారు.