04-08-2025 12:00:00 AM
రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం
నారాయణపూర్ భూనిర్వాసితులకు హామీ
రేషన్ కార్డుల పంపిణీ
కరీంనగర్/పెద్దపల్లి, ఆగస్టు 3 (విజయ క్రాంతి): రాష్ట్ర మంత్రులు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఆదివారం నుడిగాలి పర్యటన చేశారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మ ల నాగేశ్వర్రావు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరపరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ,
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సంక్షేమశాఖ మం త్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు పర్యటించారు. ప్రత్యేక హెలీక్యాప్టర్లో ఉదయం రామగుం డం చేరుకున్న మంత్రులు తొలుత అంత ర్గాం మండలంలోని గోలివాడ వద్ద రానుగుందు ఎత్తిపోతల పథకాన్ని స్థానిక ఎమ్మె ల్యే మక్కాన్ సింగ్ రాజ ఠాకూర్ , పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, ప్రభుత్వ సలహదారు అర్కాల వేణుగోపాల్రావులతో కలి సి ప్రారంభించారు.
అనంతరం అంబేద్కర్ చౌరస్తా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రామగుండు ఎ త్తిపోతల పథకం ద్వారా 75 కోట్లు ఖర్చు చే సి 13 వేల ఎకరాలకు సాగునీరు అందించే పథకాన్ని ప్రజలకు అంకితం చేశారు. పత్తిపా క రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ని ర్మాణం వల్ల 2 లక్షల 40 వేల ఎకరాల ఆ యకట్టు స్థిరీకరణ, 10 వేల ఎకరాల నూతన ఆయకట్టు సృష్టించేందుకు అవకాశం ఉం టుందని
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బా బు ప్రకటించారు. ప్రస్తుతం కోటిన్నర రూ పాయల నిధులు మంజూరు చేసి సర్వేకు ఆ దేశాలు జారీ చేశారు. అనంతరం ధర్మారం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి నూతన రేషన్కార్డులను పంపిణీ చేశారు. మొత్తం 1092 పేద కుటుంబాలకు కార్డులు పంపిణీ చేశారు. 45 కోట్ల 15 లక్షలతో ని ర్మించే ఐటీఐ భవన నిర్మాణానికి శంకుస్థాప న చేశారు.
కునారం లింకు కెనాల్ పూర్తిచేసేందుకు 3 కోట్ల 26 లక్షలు, యశ్వంత్రావు పూర్ చెరువు పూడికతీత పనులకు అవసరమైన నిధులు, ధర్మారంలో ఉన్న ఆరు లిఫ్టు నిర్వహణ మురమ్మత్తు పనులకు 82 లక్షలు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా ఉత్త మ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. అక్కడి నుంచి హెలీక్యాప్టర్ ద్వారా మానకొండూర్ నియోజకవర్గం కేశవపట్నం మండల కేం ద్రంలో లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు.
అనంతరం గట్టుదుద్దెనపల్లి విశాల సహకార సంఘం ప్రధాన కార్యాల యం నూతన భవనం, షాపింగ్ కాంప్లెక్స్లను ప్రారంభించారు. సంఘ వ్యవస్థాపకులు దివంగత అనభేరి వెంకటరావు విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి ప్రారంభించారు. అక్కడి నుంచి రా మడుగుకు చేరుకున్న మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో కలిసి నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నారాయణపూర్ భూ నిర్వాసితుల పరిహారాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం చేసిన పలు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇ చ్చారు. రాష్ట్ర మంత్రులు పలుచోట్ల మహిళా స్వయం సహాయక సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. సీఎంఆర్ చెక్కులను కూడా ఈ సందర్భంగా పంపిణీ చేశారు.
బనకచర్ల పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మం త్రులు ముక్తకంఠంతో ఖండించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై, గత ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో చేపట్టేబోయే తాగునీటి పథకాలను వివరించారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రులు స్పష్టం చేశారు.
సింగడేని ప్రాం తంలో ఇందిరమ్మ ఇళ్లకు కూడా మంత్రి శ్రీధర్ బాబు సింగరేణి స్థలాలను ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు.