20 May, 2026 | 2:42 AM

గట్టు చెరువును అభివృద్ధి చేస్తాం

20-05-2026 12:29 AM

ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు

బెజ్జూర్, మే 19 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలం అంబగట్ట గ్రామంలోని గట్టు చెరువు శిథిలావస్థకు చేరుకుందనే సమాచారం తెలుసుకున్న సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువు కట్ట, మత్తడిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు కొండల మధ్య సహజసిద్ధంగా ఏర్పడిన ఈ చెరువు 300 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడంతో పాటు పశువులు, అటవీ జంతువులకు తాగునీటి వనరుగా ఉపయోగపడుతుందని తెలిపారు. వెంటనే అంచనాలు సిద్ధం చేసి సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం తాటివాడలో శిథిలావస్థకు చేరిన రోడ్ డ్యామ్ను పరిశీలించి, రూ.45 లక్షల అంచనాలతో ప్రతిపాదనలు పంపించామని, త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి బ్రిడ్జి నిర్మాణం చేపడతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ భద్రయ్య, ఏఈఈ మణితేజ, సర్పంచ్ తేలి బాపు, కొండ్ర మనోహర్ గౌడ్, పోర్థెటి సుగుణాకర్, మడావి ముత్తయ్య, వషీ ఉల్లా ఖాన్, మెస్రం రాజారామ్, బెనికి శ్యామ్సుందర్ తదితరులు పాల్గొన్నారు.