తుర్కచెరువును అభివృద్ధి పరుస్తాం
ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, జూన్ 11 (విజయక్రాంతి): తుర్క చెరువును అభివృద్ధి పరిచి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ హామీ ఇచ్చారు. సిఎంసి నిజాంపేట్ మున్సిపల్ సర్కిల్ పరిధి బండారి లేఅవుట్, తుర్క చెరువు ప్రాంతాలలో బిఆర్‌ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ప్రజా సమస్యలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానికులు ప్రెజర్ తో నీటి సరఫరా, లైబ్రరీ పైకప్పు లీకేజీ, ఒంటరి మహిళలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు, నూతన రేషన్ కార్డులు, పెన్షన్లు, ఎస్‌ఎన్డిపి పనుల వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వర్షం వచ్చిన ప్రతిసారి బండారి లేఔట్ లోని ప్రజలు వరద నీటి సమస్యతో భయాందోళనకు గురయ్యేవారని, గత 12 ఏళ్ల కాలంలో ఎస్‌ఎన్డిపి పనుల ద్వారా వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన ఘనత బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు.
బండారి లేఔట్ లోని లైబ్రరీ పైకప్పు లీకేజీ సమస్య పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించి పైకప్పు లీకేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఎస్‌ఎన్‌డిపి పనుల ద్వారా బండారి లేఔట్‌లో వరద మంపు తీవ్రతను తగ్గించామని, రానున్న రోజుల్లో కూడా ఎస్‌ఎన్డిపి ఫేస్ -2 పనులను త్వరితగతిన పూర్తి చేసి వరద ముంపు సమస్యకు శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఇరిగేషన్ అధికారులతో కలసి తుర్క చెరువును సందర్శించిన ఎమ్మెల్యే చెరువులో మురుగునీరు కలవకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మురుగునీటిని బయటకు పంపించి వాకిం గ్ ట్రాక్, పిల్లల కోసం ఆట సామాగ్రి తో పాటు చెరువును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సాబేర్ అలీ, ఇరిగేషన్ డీఈ నాయక్, ఈఈ సురేష్ బాబు, వాటర్ వరక్స్ మేనేజర్ సౌమ్య, ఏఈ రవీంద్ర నాయక్, ఇంజనీరింగ్ ఏఈ ప్రవీ ణ్, మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యా దవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ జ్యోతి నరసింహారెడ్డి, చందు ముదిరాజ్, బాలాజీ నాయక్, గాజుల సుజాత, సంక్షేమ సంఘం అధ్యక్షులు నరసింహారెడ్డి, డివిజన్ అధ్యక్షులు నరసింహా రాజు, సీనియర్ నాయకులు జొన్నలగడ్డ రవి, పద్మావతి, లక్ష్మీ కుమారి, భారతి, శ్రీదేవి, మాన్య తదితరులు పాల్గొన్నారు.






