13-02-2026 01:04:50 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి12 (విజయక్రాంతి): మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఐదు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్, సహాయ ఇంజనీర్ సోనీ, ఎల్ అండ్ టి ప్రాజెక్టు మేనేజర్ ముత్తుస్వామికి వేరువేరుగా వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు, ఎఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ బకాయి వేతనాలు విడుదల చేసి, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎఐటీయూసీ జిల్లా కార్యదర్శి భోగే ఉపేందర్, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చాపిడి బాలేష్, జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు జంషెడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి షకీర్ తదితర కార్మికులు పాల్గొన్నారు.