30 June, 2026 | 9:38 PM

Breaking News

ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •  

అర్హులైన వారందరికీ ఇండ్లు మంజూరు చేస్తాం: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

29-06-2025 03:47 PM

చండూరు,(విజయక్రాంతి): మొదటి విడత రాని వారికి రెండో విడత జాబితాలో తప్పనిసరిగా అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు మంజూరు చేస్తామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆదివారంగట్టుప్పల మండల పరిధిలోని అంతంపేట గ్రామంలో ప్రజా సమస్యలపై ఇంటింటికి తిరుగుతూ అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఆ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కరించే నిబద్ధతగల నాయకుని గ్రామ సర్పంచ్ గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా ఎన్నుకోవాలని ఆయన గ్రామస్తులకు సూచించారు.

ఆ గ్రామానికి చెందిన గుడిసెలో నివసిస్తున్నకి రాములకు ఇందిరమ్మఇల్లు నిర్మించే బాధ్యత  నాదేనని ఆయన అన్నారు. ఆ గ్రామంలో కరెంటు లూజ్ లైన్స్, గృహాల మీదుగా వెళుతున్న 11 కెవి కరెంట్ లైన్లను వెంటనే తొలగించాలని ఆయన అన్నారు. అంతంపేట నుండి దేవుల తండా, రాజ్య తండా రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించే విధంగా కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.ఈ కార్యక్రమంలో గట్టుప్పల మండల ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.