calender_icon.png 3 February, 2026 | 11:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొల్లాపూర్ ను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా

03-02-2026 09:14:06 PM

మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డులు గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. మంగళవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్ ప‌ట్టణంలోని 1వ వార్డులో కాంగ్రెస్ అభ్య‌ర్థి పసుల సుజాత సతీష్, 19వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కాటమోని లహరి వేణుగోపాల్ గౌడ్ మ‌ద్ద‌తుగా ప్రచారం నిర్వహించారు. గడపగడపకు ప్రచారానికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓట‌ర్ల‌కు వివరించి పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.