ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం
- అభివృద్ధి చేసి చూపిస్తాం
మున్సిపల్ చైర్ పర్సన్ పదవి స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే
తాండూరు, మార్చి 2,(విజయ క్రాంతి) మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని అభివృద్ధి సంక్షేమం గడపగడపకు అందేలా కృషి చేస్తామని వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ , వైస్ చైర్మన్ రజాక్ పదవి బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ చైర్ పర్సన్ చాంబర్లో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెద పండితులు మంత్రాలు మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజకు ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని ఉన్నారు. పట్టణంలోని ప్రతి వార్డు అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని దశలవారీగా మౌలిక సదుపాయాలతో పాటు తాండూర్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా అయ్యేలా చర్యలు చేసుకుంటామని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి , మేనేజర్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




