కోటి మంది మహిళలలను కోటేశ్వరులు చేస్తాం
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి
మేడ్చల్, జూన్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాప్రా సర్కిల్ కుషాయిగూడ లోని లక్ష్మీ గార్డెన్ లో ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
మహిళా సంఘాల టీ స్టాల్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆరు గ్యారెంటీలలో మహిళ సాధికారిక కోసం ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ 4 నియోజకవర్గాలలో 5 62421 మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని, రేషన్ కార్డులు పంపిణీ లో, 200 యూనిట్ల విద్యుత్ ఉచిత సరఫరాలో మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
వీరిలో 2,53,056 మంది ఎస్ హెచ్ జీ గ్రూపుల మహిళలు, అలాగే గ్రూపులలో లేని 3 13 539 మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నాం అని వివరించారు.కార్పొరేషన్ పరిధిలో 26,601 ఎస్ హెచ్ జీ గ్రూపుల కు చెందిన 2,66,010 మహిళలకు గత ఏడాది రూ. 576 బ్యాంకు లింకేజ్ రుణాలు మంజూరు చేయగా, ప్రస్తుత 2026-27 లో 31.53 కోట్ల బ్యాంకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు.
అలాగే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 7 ఆర్టిసి డిపోలలో గత మూడేళ్ల కాలంలో 4 కోట్ల 15 లక్షల మంది మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణాలకు అవకాశాలు కల్పించగా ఇందుకు సంబంధించి 10. 15 కోట్లను ప్రభుత్వం భరించిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ రాధిక గుప్తా,డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి,అడీషనల్ కమీషనర్ రఘు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.






