24 June, 2026 | 1:15 AM

గొట్టిముక్కల పద్మారావు కుటుంబసభ్యులను పరామర్శించిన కేటీఆర్

24-06-2026 12:47 AM

కూకట్‌పల్లి, జూన్ 23 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమనాయకుడు, సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు ఈనెల 21న గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం కూకట్‌పల్లిలోని పద్మారావు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేటీఆర్‌తోపాటు ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కెపి వివేకానంద, ఎమ్మెల్సీలు నవీన్ రావు, శంబిపూర్ రాజు పద్మారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గొట్టిముక్కల పద్మారావు అకాల మృతి పట్ల కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చి పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.