24 June, 2026 | 1:05 AM

కూకట్‌పల్లిలో పోలీస్ అవుట్ పోస్టును ప్రారంభించిన డీసీపీ రితిరాజ్

24-06-2026 12:13 AM

కూకట్‌పల్లి, జూన్ 23 (విజయక్రాంతి): కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కెపిహెచ్బి మెట్రో రిజిస్ట్రేషన్ కింద నూతన పోలీస్ అవుట్ పోస్ట్ ను మంగళవారం కూకట్పల్లి డిసిపి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కూకట్పల్లి, కెపిహెచ్బి పోలీస్ స్టేషన్లో పరిధిలోని జాతీయ రహదారిపై, కెపిహెచ్బి మెట్రో స్టేషన్ సమీప ప్రాంతంలో, ఈ మధ్యకాలంలో ఆ సాంఘిక కార్యకలాపాలు పెరిగినాయని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ అవుట్ పోస్టు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో పోలీసుల పర్యవేక్షణ నిరంతరం అవసరం ఉంటుందని భావించి అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రజల దృష్టికి ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు వచ్చినయెడల వెంటనే అవుట్ పోస్టులో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

ఈ కేంద్రంలో 8 మంది పోలీసు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఎల్లవేళలా ఈ అవుట్ పోస్ట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సుదర్శన్, ఏసిపి, నరేష్ రెడ్డి, రవికిరణ్ రెడ్డి,కూకట్ పల్లి సి ఐ సుబ్బారావు, కేపిహెచ్ బి సి ఐ రాజశేఖర్ రెడ్డి,కూకట్ పల్లి, కేపిహెచ్ బి, అల్లాపూర్ పోలీస్ స్టేషన్ ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.