24 April, 2026 | 2:40 AM

సీబీఐ డైరెక్టర్‌ను కలుస్తాం

24-04-2026 01:10 AM
  1. జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధ్దమని హైకోర్టు చెప్పలేదు
  2. బీఆర్‌ఎస్ నేతల సంబరాలు ఎందుకో? 
  3. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు 

* చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేయాలి 

* శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో.. ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటు

* నామినేటెడ్ పద్ధతుల్లో పీఏసీఎస్ పాలకవర్గాలు 

* విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం.. మంత్రులు, ప్రజా ప్రతినిధులు వేతనాల్లో 50 శాతం 

* 100 రోజుల్లో బెనిఫిట్స్‌కు పరిష్కరించేందుకు కార్యాచరణ

* రూ. 700 కోట్లతో గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి 

హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి లోపాలు జరగలేదని  హైకోర్టు తీర్పు ఇవ్వ లేదని.. కానీ, బీఆర్‌ఎస్ నేతలు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారో ఆర్థం కావ డం లేదని రాష్ట్ర నీటిపారుదల మంత్రి ఉత్త మ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా  మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై వేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ చట్టవిరుద్ధ్దమని కేసీఆర్, హరీష్‌రావు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయలేదన్నారు.

అయితే  వాళ్లు సూచించిన కొన్ని సాంకేతిక అంశాలపైనే కోర్టు తీర్పు ఇచ్చిందని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, తాను సీబీఐ డైరెక్టర్‌ను కలిసి పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అందజేసి.. విచారణ కోరుతామని మంత్రి స్పష్టం చేశారు.  ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన క్యాబినెట్ సమవేశంలో పలు కీలక చర్చించి  నిర్ణయాలు తీసుకున్నారు.  ఆర్టీసీ కార్మికుల సమ్మె, కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు, ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగులకు సం బంధించిన బెనిఫిట్స్ తదితర అంశాలపై చర్చించారు.

ప్రాథమిక వ్యవవసాయ ప్రాథ మిక సహకార సంఘాలకు ( పీఏసీఎస్ ) సంబంధించి పాలక వర్గాలను నామినేటెడ్ పద్ధతిలో నియమించాలని క్యాబినెట్ నిర్ణ యం తీసుకున్నది. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి, వాకిటి శ్రీహరితో కలిసి ఉత్తమ్‌కు మార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించి ముందుకెళ్లుతామన్నారు. ప్రభుత్వం వేసిన పీషీ ఘోష్  కమిషన్  రాజ్యాంగబద్ధమైనే కాకుం టా చట్టం పరిధిలోనే ఉందని కూడా కోర్టు స్పష్టం చేసిందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు.

కాళేశ్వరంపై  సీబీఐ విచారణ కోరుతూ 9 నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే  ఎందుకు స్పందించడం లేదని ఆయన నీలదీశారు. తుమ్మడి హెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టుకు కాళేశ్వరానికి తరలించి రూ. లక్ష కోట్లకు పైగా పెంచారని ఆయన విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టును రూ. 30 వేల కోట్లతో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రాణహిత- చేవెళ్ల నిర్మిస్తామని చెప్పి, ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేశారని ఆయన విమర్శించారు.

బీఆర్‌ఎస్ హయాంలోనే డిజైన్ చేయడం, నిర్మించడం, కూలిపోవడం జరిగిందన్నారు. నేషన్ డ్యామ్ సేప్టీ అధికారులు పరిశీలించి.. నిర్మాణలోనే లోపాలున్నాయని చెప్పిందని మంత్రి గుర్తుచేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ముందుకెళ్లేందుకు గాను మంత్రివర్గ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

క్యాబినెట్ తీర్మానాలు.. 

l కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై గౌరవ హైకోర్టు ఇచ్చిన  తీర్పుపై మంత్రివర్గం చర్చించింది. జ్యుడిషియల్ కమిషన్ నియామకాన్ని హైకో ర్టు తప్పుబట్టలేదు. కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా హైకోర్టు తప్పుబట్టలేదు. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమని, రాజ్యాంగబద్ధమని కూడా అభిప్రాయపడింది. పిటిషనర్లకు నోటీసులు ఇవ్వలేదనే కేవలం సాంకేతిక కారణాలను హైకోర్టు తప్పుబ ట్టింది.

ఈ నివేదికలో వారిపై ప్రస్తావించిన అంశాలు అమల్లో ఉండవని, వాటి ఆధారంగా ఎలాంటి చర్య లు తీసుకోవద్దని మాత్రమే తీర్పునిచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు, లోపాలు, అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం జీవో జారీ చేసిం ది. తొమ్మిది నెలలైనా సీబీఐ దర్యాప్తు ఇంకా ప్రారం భం కాలేదు. హైకోర్టు తీర్పు సీబీఐ దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకిగా లేదని న్యాయనిపుణులు తెలియజేశారు.

అందుకే సీబీఐ దర్యాప్తును వేగవంతంచే యాలని ప్రభుత్వం తరఫున మరోసారి సీబీఐని  కోరాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు తీర్పు మొత్తం పరిశీలించిన తర్వాత ఢిల్లీలో ఉన్న న్యాయనిపుణులతో సంప్రదించి, సుప్రీంకోర్టుకు వెళ్లాలా.. లేదా.. అనేది, వారిచ్చే సలహాలు సూచనల ఆధారంగా నడుచుకోవాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.   

* గతంలో పదేండ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి వేల కోట్ల బిల్లులు పెండిం గ్‌లో పెట్టింది.  తెలంగాణ ఏర్పడేనాటికి ఒక్క రూపా యి కూడా బకాయి లేదు. రిటైర్మెంట్ ఏజ్ పెంచటం తో పాటు రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకపోవటంతో రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.  రాష్ట్ర మంత్రివర్గం ఈ సమస్యపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

రిటైర్డ్ ఉద్యోగులు ఆఫీసుల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి రాకుండా వెంటనే వారికి ఇచ్చే బకాయిల చెల్లింపులకు తగిన చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ ఉద్యోగులకు సంబంధించి రూ.6,200 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వా ల్సినవి రూ.8వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీటిని వెంటనే ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పటికీ వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలన్నీ అన్వేషించి, అవసరమైన నిధులు సర్దుబాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 

అవసరమైతే తమ జీతాలు, ప్రజా ప్రతినిధులకు ఇచ్చే జీతాల నుం చి 50 శాతం రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే సర్దుబాటు చేయాలని మంత్రులందరూ ఉదారంగా ముందుకువచ్చారు. రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ వెంటనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు, బాధ్యులైన వారందరినీ పిలిచి చర్చలు జరపాలని,  వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ౧౦౦ రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు దిశగా తగిన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది.  

* రాష్ట్రంలో పదవీ కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాలకు  నామినేట్ పద్ధతిన పాలకవర్గాలను నియమించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  

* గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలో అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 64 ఎకరాల్లో 21 రకాల స్పోర్‌‌సీకు సంబంధించిన సౌకర్యాలు కల్పించడంతో పాటు అవుట్ డోర్ స్టేడియం సామర్థ్యం 20 వేల నుంచి 50 వేలకు పెంచాలని నిర్ణయించింది. 

స్వి మ్మింగ్ పూల్ సామర్థ్యం పెంపుతో పాటు స్పోరట్స్ యూనివర్సిటీ ఏర్పాటు... క్రీడాకారులకు వసతి, శిక్షణ సౌకర్యాలు కల్పించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మిగిలిన 12 ఎకరాలను డెవలపర్స్‌కు ఇచ్చి కమర్షియల్ యాక్టవిటీస్‌కు అనుమతి... కమర్షియల్ యాక్టవిటీస్‌తో వచ్చే రెవెన్యూను స్పోరట్స్ యూనివర్సిటీ నిర్వహణ, క్రీడాకారుల వసతి, శిక్షణ ఇతర కార్యక్రమాలకు ఉపయోగించాలని కేబినెట్ నిర్ణయించింది.

* మంథని నియోజకవర్గ ప్రాంత ప్రజల చిరకాల కోరిక చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ పూర్తిచేయాలని క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. మహాదేవ్‌పూర్, కాటారం, మల్హర్ రావు, మహముత్తారం మండలా ల్లో దాదాపు 45 వేల ఎకరాలకు,  63 గ్రామాల  ప్రజలకు ఈ ప్రాజెక్టుతో ప్రయోజనం చేకూరుతుం ది. భూసేకరణ కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు 2427 ఎకరాల భూమి అవసరం. ఇప్పటివరకు 1020 ఎకరాలు సేకరించారు. మిగిలిన భూసేకరణకు అవసరమయ్యే రూ.166.67 కోట్ల ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 

* శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌కు  చెందిన 85.10 ఎకరాలను మత్స్య శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.