17 April, 2026 | 3:23 AM

బీసీ సబ్‌కోటా వచ్చేంతవరకు దీక్ష విరమించం

17-04-2026 12:00 AM

-బీసీ మహిళా జేఏసీ చైర్మన్ మట్టా జయంతి

-జయంతి దీక్షకు మద్దతునిచ్చిన పలు బీసీ సంఘాల నేతలు

ముషీరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): మహిళా రిజర్వేషన్లలో బీసీ మహి ళలకు సబ్‌కోటా సాధన కోసం బీసీ మహిళ జేఏసీ చైర్మన్ మట్ట జయంతి గౌడ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష గురువారం 3వ రోజుకు చేరింది.

హిమాయత్ నగర్ లోని బీసీ భవన్ దీక్ష శిబిరం వద్ద జయంతి గౌడ్ కు మద్దతుగా ఓబిసి ఇంటలెక్చువల్ ఫోరం జాతీయ అధ్యక్షులు ఆళ్ల రామ కృష్ణ ఫూలే, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్‌గౌడ్, గడ్డం మహా లక్ష్మీ రామన్‌గౌడ్, బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షులు బొంగు ప్రసాద్‌గౌడ్, అడ్వకెట్ మహేష్ బాబు చోల్లేటి, బీసీ మేధావుల ఫోరమ్ కన్వీనర్ సుదగాని హరిశంకర్ గౌడ్, తెలంగాణ బీసీ మహిళా సంక్షే మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పుల్యంగారి సరితా ముదిరాజ్, తెలంగాణ బీసీ మహిళ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి రజిత పటేల్, బీసీ రాజ్యాధికార సమితి పోశెల సరస్వతి, స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలంగాణ జన సమితి సత్తూరి పుష్ప నీలా గౌడ్, బీసీ నాయకులు సాంబ లక్ష్మీ కోపరాజు, డేగల రామ దేవి, ముదిరాజ్ మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎర్రం సంజీవ పటేల్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కెఎం. భిక్షపతి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, ఎర్ర శ్రీహరి హాజరై మట్టా జయంతిగౌడ్ ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేశారు. మహిళా రిజర్ వేషన్లలో సబ్ కోట వచ్చేంత వరకు దీక్షను విరమించే లేదని మట్టా జయంతి స్పష్టం చేశారు.