19-01-2026 12:00:00 AM
నందమూరి బాలకృష్ణ
బంజారాహిల్స్, జనవరి 18 (విజయక్రాంతి):క్యాన్సర్ నివారణకు తన తండ్రి ఎన్టీఆర్ బసవతారకం హాస్పిటలును స్థాపించారని.. ఆయన లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలని హాస్పిటల్ చైర్మన్ నందమూ రి బాలకృష్ణ వైద్యులు, సిబ్బందికి సూచించారు.మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ దంపతుల విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు.
అనంతరం హాస్పిటల్‌లో ఉన్న ఆరోగ్యశ్రీ వార్డులో పండ్లను పంపిణీ చేశా రు. క్యాన్సర్ బాధిత చిన్నారులకు ఆట వస్తువులు, పుస్తకాలను స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బసవతారకం ట్రస్టు బోర్డు సభ్యులు జెఎస్‌ఆర్ ప్రసాద్,హాస్పిటల్ సీఈఓ డాక్టర్ కె.కృష్ణయ్య,మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టియస్ రావు,మెడికల్ అంకాలజీ విభాగం డాక్టర్ సెంథిల్ రాజప్ప,పలువురు వైద్యులు, సిబ్బంది, బాధితులు ఉన్నారు.