15 April, 2026 | 7:24 AM

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం

16-12-2025 12:02 AM

పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

ప్రజలు ఓటు హక్కు వినియోగించే విధంగా విస్తృత ఏర్పాట్లకు ఆదేశాలు జారీ

నిజామాబాద్ డిసెంబర్ 15 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో  ఎన్నికలు ఆర్మూర్ డివిజన్ పరిదిలో జరగనున్న దృష్ట్యా బందోబస్తు ఏర్పాట్లను నేడు  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య,  ఆర్మూర్ ఎ.సి.పి కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించరు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమా వళిని తూ.చా తప్పకుండా పాటించాలని ఆదేశాలు ఇచ్చారు.

 ప్రధానంగా ఆర్మూర్ డివిజన్ పరిధిలో గల సమస్యత్మకమైన, అతిసమస్యత్మక మైనటువంటి పోలింగ్ స్టేషను* గుర్తించి పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ప్రతీ పోలింగ్ కేంద్రానికి నిర్దిష్ట దూరంలో మార్కింగ్ చేయించి , ప్రచారం , గుర్తులను ప్రదర్శించడం నివారించాలని అన్నారు.

అవసరాన్ని బట్టి స్ట్రైకింగ్ ఫోర్స్ సేవలను వినియోగించుకొని గుంపులను చెదర గొట్టాలని అన్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే డబ్బు, మద్యం, మరే ఇతరములు అక్రమ రవాణా జరగడానికి విలులేకుండా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారులు ఆయా గ్రామలపై నిఘా ఉంచి, ముందస్తు సమాచారాన్ని సేకరించి, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు కృషి చేయాలని అధికారులకు తెలియజేసారు.

ఎన్నికల రోజు సిబ్బంది తెల్లవారుజామునే తమకు కేటాయించి నటువంటి పోలింగ్ బూతులలో సక్రమమైన విధులు నిర్వహించాలని , ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపు కార్యక్రమం మొత్తము పూర్తి అయ్యేవరకు ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దని, ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా పాటించే విధంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని విధినిర్వహణలో ఎలాంటి లోపాలు ఉన్న అట్టి సిబ్బందిపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని సి పి హెచ్చరించారు.   

ఈ సందర్భంగా ఆర్మూర్ ఏ.సి.పి జె. వెంకటేశ్వర్ రెడ్డి , ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ పి. సత్యనారాయణ గౌడ్ , ఆర్మూర్ రూరల్ సి. ఐ కె. శ్రీధర్ రెడ్డి , భీంగల్  సి. ఐ  పి. సత్యనారాయణ గౌడ్ , బాల్కొండ ఎస్. ఐ శ్రీ కె. శైలేందర్  , నందిపేట్ ఎస్. ఐ జి. శ్యామ్ రాజ్ , వేల్పూర్ ఎస్. ఐ  బి. సంజీవ్ , ఎస్. ఐ ముప్కాల్ కిరణ్ పాల్ , మెండోరా ఎస్. ఐ సుహాసిని , భీంగల్ ఎస్. ఐ కె. సందీప్ , మోర్తాడ్  ఎస్. ఐబి. రాము , కమార్ పల్లి ఎస్. ఐ శ్రీ జి. అనీల్ రెడ్డి , ఏర్గట్ల  ఎస్. ఐ పి. రాజేశ్వర్ , మాక్లూర్ ఎస్. ఐ రాజశేఖర్  పాల్గొన్నారు