calender_icon.png 16 December, 2025 | 6:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు సర్కార్ దృష్టికి తీసుకు వెళ్తా..

16-12-2025 12:04:34 AM

అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ 

నిజామాబాద్ 15(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు 35 ఏళ్ల పాటు వివిధ ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేసి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు అంటే తనకు ఎనలేని గౌరవమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో  క్రీడా పోటీల కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం తో పాటు ఎంపీ తో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికిహామీ ఇచ్చారు. 35 ఏళ్ల పాటు పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగుల తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా తనవంతుగా తన ట్రస్టు ద్వారా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల సాయం అందిస్తానని విశ్రాంత ఉద్యోగుల కు హామీ ఇచ్చారు.

ఉద్యోగుల భవనం ప్రస్తుతం ఇరుకుగా ఉందని రిటైర్డ్ ఉద్యోగులు తమ దృష్టికి తీసుకువచ్చారని దాన్ని పరిష్కరించేందుకు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విశాలమైన స్థల సేకరణతో పాటు నూతన భవనం నిర్మాణం కొరకు కూడా తాను కృషి చేస్తానని ఉద్యోగుల కుభరోసా ఇచ్చారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఐక్యంగా ఉండి తమకు ప్రభుత్వాపరంగా రావాల్సిన హక్కుల కోసం  కలిసికట్టుగా తమ హక్కులు సాధించుకోవడం అభినందనీయమన్నారు.

మూడు రోజులపాటు క్యారం, చెస్, షటిల్ లాంటి క్రీడలు ఆడడానికి ముందుకు రావడం వారిలో ఉన్న ఐక్యతకు నిదర్శనమని అన్నారు. అలాగే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తన కుమారుడి హాస్పిటల్ సన్రైజ్ హాస్పిటల్ కు వెళ్తే నాణ్యమైన మెరుగైన చికిత్స అందిస్తామనిఉద్యోగులకు ఆయన సూచించారు.  ఏవిధమైన సమస్య లు ఉన్న  తన ఇంటి తలుపు తట్టి తనకు కలవచ్చని ఆ సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాంత విశ్రాంత ఉద్యోగులు ఆయనను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి శ్రీనివాస్ రెడ్డి, విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మల్లయ్య పండరినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చబోయిడి గంగ కిషన్, కోశాధికారి రవీందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు భోజా గౌడ్, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.