28 May, 2026 | 1:36 AM

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు వెంటనే పంపిణీ చేయాలి

28-05-2026 12:49 AM

గజ్వేల్ ఐఓసీ ఎదుట బీజేపీ ధర్నా

గజ్వేల్ మే 27: గజ్వేల్ నియోజకవర్గంలో పెండింగులో ఉన్న 1100కు పైగా కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను వెంటనే అర్హులకు అందజేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు గజ్వేల్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు దేవులపల్లి మనోహర్ యాదవ్, మండల అధ్య క్షుడు పంజాల అశోక్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కుమ్మక్కు రాజకీయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. 

ఈ కార్యక్రమంలో బిజెపి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కూడిక్యాల రాములు, బిజెపి కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, మర్కుక్, కుక్కునూరుపల్లి, వర్గల్ మండలాల బిజెపి అధ్యక్షులు సాయి రెడ్డి రామిరెడ్డి, అనుముల సంపత్ రెడ్డి, బొల్లిపల్లి తిరుపతిరెడ్డి, బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు చెప్యాల వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు ఎల్కటి సురేష్, అలేటి సుమతి, మాజీ కౌన్సిలర్ రొట్టెల రామదాస్, గజ్వేల్ పట్టణ, గజ్వేల్, మర్కుక్ మండల  మండల ప్రధాన కార్యదర్శులు నాయిని సందీప్ కుమార్, నరసింహ ముదిరాజ్, బార్ అరవింద్, ఇప్ప స్వామి, మహేందర్, నాయకులు నాగు ము దిరాజ్, భాస్కర్ రెడ్డి, మార్కంటి ఏగొండ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.