26 June, 2026 | 6:30 PM

Breaking News

డబుల్ లైన్ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన చైర్మన్ బిరుదు రాధాకృష్ణ   •   సుల్తానాబాద్ లో వైభవంగా మొహరం వేడుకలు   •   ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కాంగ్రెస్ హెచ్చరిక   •   యూరియా యాప్ రద్దు చేసి రైతులకు నేరుగా పంపిణీ చేయాలి   •   హరీష్ రావుకు ఆహ్వాన పత్రిక అందజేత   •   టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. వైభవ్‌కు దక్కని చోటు   •   జగ్గారం పంచాయతీ పాలవాగు చెరువు ప్రక్షాళనకు ఎమ్మెల్యేకు వినతిపత్రం   •   Say No to Drugs: ఒక్కసారి డ్రగ్స్ బారిన పడితే... జీవితం నిర్వీర్యం   •   డ్రగ్స్ కేసులో దొరికితే.. ఎంతటి వారైనా వదిలిపెట్టం: భట్టి విక్రమార్క   •   బొడ్రాయి, ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ట   •  

ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులను సహించం

26-02-2026 02:00 AM

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 25 (విజయక్రాం తి): బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులను సహించబోమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. కుమ్మెర ఘటన బాధితులను బుధవారం ఆయన పరామర్శించా రు. కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో సమావేశమై కేసు నమోదు ప్రక్రియ, నిందితులపై తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. బాధితులకు తక్షణ న్యాయం అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, కేసు దర్యాప్తును వేగవంతం చేయాలనీ ఆదేశించా రు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహతో మాట్లాడినట్లు తెలిపారు.

కేసును వేగంగా పరిష్కరించే దిశగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామన్నారు. బాధితులకు తక్షణ ఖర్చుల నిమిత్తం గణేష్, మౌనికలకు రూ.లక్ష చెక్కును అందజేశారు. బాధిత కుటుంబానికి నాగర్ కర్నూల్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కల్పించాలని, గణేష్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు.