జర్నలిస్టుల హక్కులను కాలరాస్తే సహించేది లేదు...
ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్
హుజురాబాద్, ఆగస్టు16 (విజయ క్రాంతి) : జర్నలిస్టుల రెండు దశాబ్దాల సుదీర్ఘ పోరాటాలతో దక్కించుకున్న ఇళ్ల స్థలాల జోలికొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అక్రమ కుట్రలను సహించే ప్రసక్తే లేదని ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు నగునూరి శేఖర్ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లాటీయు డబ్ల్యూజే (ఐజేయూ) హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వేదికగా జర్నలిస్టులు చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్షలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గూడూరు స్వామిరెడ్డి పెట్టిన వివాదాస్పద కేసుపై రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆయనతో మాట్లాడి కేసును బేషరతుగా ఉపసంహరింపజేయాలని అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో జర్నలిస్టుల ఆగ్రహ జ్వాలలు రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుతాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్, జర్నలిస్టులు కేదాసి శ్రీధర్, నిమ్మటూరి సాయికృష్ణ, సమ్మెట సతీష్, బొడ్డు శ్రీనివాస్, మచ్చిక చందు, టేకుల సాగర్, పోతరాజు సంపత్, బండి సాయికృష్ణ, నాగవెళ్లి రాజు, బొడ్డు శ్రీనివాస్, భారత రజనీకాంత్, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సామాజికవేత్త సబ్బానీ వెంకట్, బీసీ జేఏసీ నాయకులు చందుపట్ల జనార్ధన్, వెంకటేష్, దేవసాని ప్రియదర్శిని, జేఏసీ నాయకులు వేల్పుల రత్నం, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మాడుగుల ఓదెలు, ముదిరాజ్ సంఘం నాయకులు కొలిపాక సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.






