calender_icon.png 7 September, 2025 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కష్టజీవులకు అండ ఎర్ర జెండా

07-09-2025 08:16:52 AM

చరిత్రను వక్రీకరించే మతోన్మాదుల కుట్రలను తిప్పి కొట్టాలి 

ప్రజా సమస్యలపై ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మానిక్

కొండాపూర్: కొండాపూర్ మండలంలో(Kondapur Mandal) ముఖ్య కార్యకర్తల సమావేశలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అతిమేల మాణిక్(Atimela Manik) మాట్లాడుతూ... నాడు భూమికోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం నిరంకుశ నిజాం రాజుకు జమీందారు జాకీర్దారులు దేశ్ ముకులు దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మకమైన వీర తెలంగాణ సాయి ధరైతంగా పోరాటం అని అన్నారు. ఈ పోరాటానికి కమ్యూనిస్టులు మాత్రమే వారసులు అని అన్నారు.. ఈ పోరాటంలో పాల్గొనకుండా ఈ పోరాటానికి సంబంధం లేని మతోన్మాదు చరిత్రను  వక్రీకరిస్తన్నారని  అన్నారు.

ఈ పోరాటంలో  వేలాది మంది అమరులైనారు. వారి  స్పూర్తితో  ప్రజా ఉద్యమాలు నిర్మించడమే కమ్యూనిస్టు లక్ష్యం అన్నారు .  కమ్యూనిస్టులు   దున్నేవానికే  భూమి కావాలని, దొరల, గాడిలను బద్దలు కొట్టి  భూస్వాముల దోపిడీ పీడనకు, వెట్టి చాకిరికి - చిమర గీతం పాడుతూ రైతులను కూలీలను రైతులను కార్మికులను కష్టజీవులను ఒక తాటికి తీసుకొచ్చి ఉద్యమాలు నడిపింది ఎర్రజెండా అన్నారు ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను చేతికి వచ్చిన దశలో పన్నులు కట్టాలని  పంటలు తీసుకొని వెళుతుంటే ప్రజలు కష్టజీవుల  తరపున ఎదురు తిరిగి నిలబడి పోరాడింది ఎర్రజెండా దోపిడి రాజ్యాన్ని అహంకార దోపిడి ఆగడాలకు  వ్యతిరేకంగా  కమ్యూనిస్టు పార్టీ కుల, మతాలకతీతంగా అందరిని  ఐక్యం చేసి 10 లక్షల ఎకరాల భూములు పంచిన ఎర్ర జెండా ఈ ఎర్రజెండా పోరాటాలలో 4,500 మంది  కార్మికులు ప్రజలు రక్తతర్పణం గావించారని అన్నారు. సెప్టెంబర్ 10 వీరనారి ఐలమ్మ వర్ధంతి నుండి సెప్టెంబర్ 17 వరకు గ్రామాలలో జరిగే  సభలను జయప్రదం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే రాజయ్య మండల కమిటీ సభ్యులు బి నరసింహ రెడ్డి బాబురావు ప్రవీణ్ఈ కార్యక్రమంలో  తదితరులు పాల్గొన్నారు.