calender_icon.png 7 September, 2025 | 2:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమజ్జనంలో అపశృతి.. టస్కర్ ఢీకొని జీహెచ్ఎంసీ కార్మికురాలు మృతి

07-09-2025 10:17:20 AM

హైదరాబాద్: టస్కర్ వాహనం ఢీకొని విధుల్లో ఉన్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు(GHMC sanitation worker) మృతి చెందింది. మృతురాలిని గుడిమల్కాపూర్ కు చెందిన రేణుకగా గుర్తించారు. బషీర్ బాగ్ వద్ద రోడ్డు(Road Accident) దాటుతుండగా రేణుకను టస్కర్ ఢీకొట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టస్కర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. టస్కర్  డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తోటి పారిశుద్ధ్య కార్మికురాలు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలని కార్మిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.