07-09-2025 09:39:59 AM
హైదరాబాద్: నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు(Extramarital affairs) మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. రోజు రోజుకు వివాహేతర సంబంధించి ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఇది.. వరంగల్ జిల్లా(Warangal District) వర్ధన్న పేట మండలం గుబ్జేడితండాలో దారణం చోటుచేసుకుంది. తండ్రి సపావత్ రాజా(60)ను కుమారుడు సపావత్ సురేశ్(28) కొట్టి చంపాడు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తుందని భార్య మౌనికను సురేశ్ చంపేందుకు ప్రయత్నించాడు. అడ్డువచ్చిన తండ్రిని సురేశ్ కొట్టి చంపాడు. మృతుని కూతురు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.