07-09-2025 10:50:17 AM
మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి మండలంలోని పొన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయునిగా(Physical science teacher) విధులు నిర్వహిస్తున్న కలుపాల శ్రీనివాసం మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని మండల విద్యావనరుల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్, మండల విద్యాధికారి దత్తు మూర్తి లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ పొన్నారం జిల్లా పరిషత్ పాఠశాలలో గత రెండు సంవత్సరాలుగా ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తూ పాఠశాలలో విద్యార్థుల విద్యాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని, ఆయన చేసిన సేవలకు ఫలితంగానే మండలస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారని ఆన్నారు.
పొన్నారం పాఠశాల ఉపాధ్యాయునికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం పాఠశాలకు గర్వకారణ మన్నారు. ఈ కార్యక్రమంలో పొన్నారం పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ రాఫిల్ రెడ్డి, మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయు రాలు సారా తస్నీం, పునర ఉపాధ్యాయుడా పొన్నారం పాఠశాల ఉపాధ్యాయులు సత్యనారాయణ, రామకృష్ణాపూర్ బాలుర పాఠశాల ప్రధానోపా ధ్యాయులు శ్రీనివాస్, పొన్నారం మాజీ వార్డు సభ్యులు గడ్డం శ్రీనివాస్, ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు లింగయ్య లు పాల్గొన్నారు.