07-09-2025 09:26:40 AM
హైదరాబాద్: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు(Hyderabad Ganesh immersions) కొనసాగుతున్నాయి. హుస్సేన్ సాగర్(Hussain Sagar)లో గణేష్ విగ్రహాల నిమజ్జనం(Ganesh Immersion) మధ్యాహ్నం వరకు కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ట్యాంక్ బండ్ పై గణపతి విగ్రహాల వాహనాలు బారులు తీరాయి. మినీట్యాంక్ బండ్ సరూర్ నగర్ చెరువులోనూ వేలాది విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది.
ప్రధాన చిన్నచిన్న చెరువుల్లోనూ గణష్ నిమిజ్జనాలు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ(Greater Hyderabad Municipal Corporation) పరిధిలో ఇప్పటివరకు 2.61 లక్షల గణేష్ ప్రతిమలు నిమజ్జనం అయినట్లు అధికారులు పేర్కొన్నారు. నిమజ్జనాల సందర్భంగా హైదరాబాద్ లో ఉదయం 10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 11 వరకు హైదరాబాద్ లోకి లారీలు ప్రవేశం లేదని పోలీసులు హెచ్చరించారు. అంతర్రాష్ట్ర, జిల్లా బస్సులు చాదర్ ఘాట్(Chaderghat) వైపు మాత్రమే దారి మళ్లించారు. విమానాశ్రయం వెళ్లేవారు పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే లేదా ఔటర్ రింగ్ రోడ్ వాడాలని సూచించారు. సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్ల: 040-27852482, 8712660600, 9010203626.