పబ్లిక్ క్లబ్‌ను అగ్రస్థానంలో నిలుపుతాం
కోదాడ, మార్చి 29: సామాజిక సేవా కార్యక్రమాల్లో కోదాడ పబ్లిక్ క్లబ్ ను అగ్ర స్థానంలో నిలుపుతాం అని కోదాడ పబ్లిక్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కత్రం సీతారామి రెడ్డి పోటు రంగారావు లు అన్నారు. ఆదివారం కోదాడ పబ్లిక్ క్లబ్ లో నిర్వహించిన నూతనంగా పాలక వర్గ ప్రమాణ స్వీకారం లో పాలక వర్గ సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మాట్లాడుతూ క్లబ్ నియమ నిబంధనలు పాటిస్తూ క్లబ్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
తమ పాలక వర్గం ఎన్నికకు సహకారం అందించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి, మాజీ ఎమ్మెల్యే లు వేనెపల్లి చందర్ రావు, బొల్లం మల్లయ్య యాదవ్, ఎన్నికల అధికారి ఎస్‌ఆర్ కే మూర్తి లకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా అధ్యక్ష కార్యదర్శులతో పాటు కార్యవర్గం లోని ఉపాధ్యక్షులు తోట రంగారావు ,గుండపనేని వెంకట సత్యనారాయణ రావు ,సంయుక్త కార్యదర్శిగా వంగవీటి గురునాథం , కె.విద్యాసాగర్ రావు, కార్యవర్గ సభ్యులుగా తమ్మనబోయిన రామయ్య , అమరనాయిని శేషగిరిరావు సుంకర సత్యనారాయణ, ప్రతాప్, రవికుమార్ పాల్గొన్నారు.




