12 July, 2026 | 2:43 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

మానసిక ప్రశాంతత భక్తితోనే సాధ్యం

30-03-2026 02:12 AM

మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ 

కోదాడ, మార్చి 29 : భక్తితోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.రెండవ భద్రాద్రిగా ప్రసిద్ధిగాంచిన కోదాడ పట్టణ పరిధిలోని తమ్మరబండపాలెం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో నిర్వహిస్తున్న కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా స్వామివారిని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ పురోహితులు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కి వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనాలు అందజేసి, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు వెంకటేశ్వరమ్మ, నరసింహారావు, శ్రీధర్, కృష్ణయ్య, శిరీష యల్లయ్య, చంద్రమోహన్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.