19 April, 2026 | 2:01 AM

ప్రజారోగ్యాన్ని కాపాడతాం

19-04-2026 12:41 AM
  1. సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాం
  2. ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి

వరంగల్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధి చేసిన తాగునీరు అందించడం అత్యంత అవసరమని, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మ న్, బీఆర్‌ఎస్ పార్టీ వరంగల్ జిల్లా నాయకుడు పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు శనివారం వరంగల్‌లోని రాయపర్తి మండలం జయరాం తండా (ఎస్) గ్రామంలో వాటర్‌ఫ్లాంట్ గదిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండా ప్రజలు తాగునీటి సమస్యలను తమ దృష్టికి తీసుకువచ్చారని చెప్పా రు.

ప్రజాప్రయోజనార్థం ఉచిత మినరల్ వాటర్ అందించాలని నిర్ణయించినట్లు తెలిపా రు. ఐఐటీ ఖరగ్‌పూర్ హైదరాబాద్, కృషి విజ్ఞాన్‌కేంద్ర మామునూర్ సంస్థలు వాటర్ ప్లాంట్ యంత్రాన్ని అందించగా, వాటిని ఏర్పాటు చేసేందుకు అవసరమైన గది నిర్మాణాన్ని ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చేపట్టిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ సేవాకార్యక్రమాలను కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నామని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.